Harish Rao Arrest

Cyberabad, SEP 12: శంషాబాద్‌ పీఎస్‌కు తరలిస్తున్నారు. అయితే, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్‌ఎస్‌ నేతలు అభ్యంతరం తెలిపారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్‌ (BRS) డిమాండ్‌ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టులకు దిగారు. బీఆర్‌ఎస్‌ నేతలను ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేశారు. ఈ క్రమంలో హరీశ్‌రావును పోలీసులు లాక్కువెళ్లేందుకు ప్రయత్నించగా హరీశ్‌రావు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తున్నది.

Here's Harish Rao Arrest Video

 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే గాంధీ అనుచరులు, కాంగ్రెస్‌ కార్యక్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. కౌశిక్‌రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్‌ రెడ్డి నివాసానికి వచ్చిన గాంధీని పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

MLA Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డిది మనిషి జన్మేనా..ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్ 

అయితే, దాడిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ సీపీ ఆఫీస్‌ వద్ద ఆందోళనకు దిగింది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.