MLC Kavitha Participates in Yadagirigutta Giri Pradakshina on Lakshmi Narasimha Swamy Temple(X)

Yadagirigutta, Jan 22:  యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు కవిత. స్వామి వారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన కవిత... కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

యదగిరిగుట్ట ను కేసీఆర్ మహాద్బుతంగా అభివృద్ధి చేశారు అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి...యదగిరిగుట్ట లో మిగిలిన పనులను పూర్తి చేయాలి..ఉమ్మడి నల్లగొండ అంటేనే చైతన్యానికి మారు పేరు అన్నారు. కేసీఆర్ నాయకత్వం లో నల్గొండ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది...మిషన్ భగీరథ తో నీళ్లు ఇవ్వడం ద్వారా నల్లగొండ జిల్లాలో జీరో ఫ్లోరైడ్ అని పార్లమెంట్ లో ప్రకటించారు అన్నారు.

నల్లగొండ జిల్లాలో కేసీఆర్ చేసిన అద్భుతం అది.... మూసి నది కాలుష్యానికి కారణం కాంగ్రెస్....మూసి నదిని శుద్ధి చేయాలని కేసీఆర్ నడుం బిగించారు అన్నారు. ఎస్టీపీ ప్లాంట్‌లను ఏర్పాటు చేసింది కేసీఆర్.... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూసి ని atm గా మార్చుకున్నారు అన్నారు. మూసీ పేరుతో కోట్ల ప్రజాధనం లూటీ చేస్తున్నారు..మూసి ప్రక్షాళన అంటూ పేదల ను రోడ్డున పడేస్తున్నారు... పేదల ఇల్లు కులుస్తున్నారు అన్నారు.  బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు, సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌ దాడి చేశారంటూ ఫిర్యాదు 

మూసీ ప్రాజెక్టు లో ధనాన్ని దోచి, ఢిల్లీకి కప్పం కట్టెల కాంగ్రెసు కుట్ర చేస్తుంది.... రౌడీ ముకలతో దాడులకు దిగుతున్నారు కాంగ్రెస్ వాళ్లు... భౌతిక దాడులు చేస్తున్నారు...61 లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ మా brs.. మిము తల్చుకుంటే కాంగ్రెసు నాయకులు ఎక్కడ తిరగలేరు...పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు చేసినం అన్నారు. ఉమ్మడి నల్లగొండ లో 3 మేడీకల్ కాలేజీలను ఏర్పాటు చేసినం...అద్భుతమైన కలెక్టరేట్ లను కట్టినం...ఆదాయాన్ని పెంచి పేదలకు పంచేలా మా పాలన సాగింది... కాంగ్రెస్ ఇప్పుడు పెడుతున్న గ్రామ సభలు గందరగోళం గా మారాయి అన్నారు.

MLC Kavitha Participates in Yadagirigutta Giri Pradakshina

లబ్ధిదారులకు పథకాలు రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం గా ఉన్నారని.. ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైందన్నారు. అన్ని పథకాల్లో కోతలు పెట్టారు...దాన్యం కొనుగోళ్లు లలో గోల్ మాల్ చేశారు..10 శాతం కూడా దాన్యాన్ని కొనుగోలు చేయలేదు....నీటి ప్రాజెక్టు లను మూలకు పడేశారు.. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయాలని కుట్ర చేస్తున్నారు... అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు...కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు వచ్చాయి.. పెన్షన్ లు పెంచలేదు...కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు అని దుయ్యబట్టారు.