బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.  126(2), 115(2), 352,351(2), r/w 189(2), r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఏకశిలా నగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌తో పాటు 30 మంది దాడి చేశారంటూ ఫిర్యాదు నేపథ్యంలో కేసు ఫైల్ అయింది.

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే.  తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. వీడియో ఇదిగో, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎందుకంటే.. 

Police Case Filed Against BJP MP Etela Rajender

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)