MMTS Train Crash - Loco Pilot Rescue Operations | Photo: Twitter

Hyderabad, November 11: కాచిగూడ స్టేషన్ (Kachiguda Station)వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో క్యాబిన్ లో ఇరుక్కుపోయిన MMTS Train లోకోపైలట్ చంద్రశేఖర్ (Loco Pilot Chandra Shekhar) ను రెస్క్యూ టీమ్ ఎట్టకేలకు బయటకు తీయగలిగింది.  డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీయటం కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది దాదాపు 8 గంటలు శ్రమించింది. అనంతరం చికిత్స నిమిత్తం అతణ్ని నాంపల్లి లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. రైలు భాగాలు ధృడమైన స్టీలుతో తయారు చేయబడి ఉండటం ద్వారా అతణ్ని బయటకు తీసే ప్రక్రియ ఆలస్యం అయింది. గ్యాస్ కట్టర్ తో ట్రైన్ పార్టులను కత్తిరిస్తే అతడికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటం కారణంగా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పార్ట్ కత్తిరిస్తూ బయటకు తీయడం జరిగింది. అయినప్పటికీ ఆయనకు కొన్ని గాయాలయినట్లుగా తెలుస్తుంది.  రైలు ప్రమాదం సీసీటీవీ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

NDRF Rescue Operations:

 

లోకో పైలట్ ఎంఎంటీఎస్ ముందు భాగంలోనే ఉంటాడు కాబట్టి, ఆ ట్రైన్ ముందున్న ట్రైన్ ను ఢీకొన్న వెంటనే ఎంఎంటీఎస్ ముందు భాగం, ఎదురుగా ఉన్న ట్రైన్ లోకి చొచ్చుకొని పోయింది. దీంతో లోకో పైలట్ చంద్రశేఖర్ అందులోనే ఇరుక్కుపోయాడు. అతణ్ని ఎలాగైనా రక్షించాలనే లక్ష్యంతో పనిచేసిన రెస్క్యూ సిబ్బంది అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. లోకో పైలట్ కు శ్వాస ఆడేందుకు వీలుగా ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా క్యాబిన్ లోకి ఆక్సిజన్ ను సరఫరా చేసింది, అతడు ఇరుక్కున చోటును ఖచ్చితంగా గుర్తించి, వైద్యులు సైలైన్స్ కూడా ఎక్కించారు. అదృష్టవషాతూ ప్రాణాలతో భయటపడటం ద్వారా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా రెస్క్యూ టీం అతణ్ని కాపాడేందుకు చేసిన కృషి పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.