Hyderabad, Aug 3: హైదరాబాద్ (Hyderabad) లోని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి భవనంపై (Osmania Hospital) రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించి, ప్రస్తుత భవనాన్ని వారసత్వ భవనం (హెరిటేజ్ బిల్డింగ్)గా మారుస్తామని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోని 30 ఎకరాల స్థలంలో నూతన ఆసుపత్రిని నిర్మించాలని సర్కారు నిర్ణయించింది.
మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు
కూల్చాలని భావించి.. ఆ తర్వాత
నిజానికి ప్రస్తుతం ఆసుపత్రి కొనసాగుతున్న భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని అప్పటి కేసీఆర్ సర్కారు భావించింది. అయితే, వారసత్వ భవనాల కూల్చివేత సరికాదంటూ చరిత్రకారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించింది. కాగా, ప్రస్తుతం ఉన్న భవనాన్ని 1919లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు.