
Nirmal, Feb 16: సాధారణంగా కొన్నిసార్లు జంతువులు (Animals) గుళ్లలో ప్రవేశిస్తుంటాయి. మనుషుల్లా పూజలు చేయాలనుకుంటాయో ఏంటో కానీ.. అవి దేవుడి గుడుల చుట్టు ప్రదక్షిణలు చేస్తుంటాయి. ఇటీవల కొన్ని జంతువులు దేవుడి విగ్రహాలను కొలవడం వార్తలలో తరుచూ కనిపిస్తూనే ఉంది. ఇదీ అలాంటి ఘటనే.. నిర్మల జిల్లా బాసరలోని దాస ఆంజనేయ స్వామి ఆలయంలోకి (Hanuman Temple) ఇటీవల ఓ కొండముచ్చు ప్రవేశించింది. హనుమంతుడి విగ్రహం పాదాల వద్ద కూర్చొన్న ఆ కొండముచ్చు కాసేపు అలాగే మౌనంగా ఉండసాగింది. దీంతో ఆ జీవిని హనుమంతుడిగా భావించి భక్తులు పూజలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఆంజనేయ స్వామి ఆలయంలో కొండముచ్చు..
హనుమంతుడి విగ్రహం పాదాల వద్ద కూర్చొన్న వానరం
నిర్మల జిల్లా బాసరలోని దాస ఆంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించిన కొండముచ్చు.. హనుమంతుడిగా భావించి పూజలు చేసిన భక్తులు
సోషల్ మీడియాలో వీడియో వైరల్ pic.twitter.com/QDhaO502id
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025
ఏపీలో శివలింగంపై నాగమ్మ
ఇటీవల ఏపీలో మాఘీ పౌర్ణమి వేళ ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విశాఖలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న శివాలయంలో ఒక నాగుపాము ప్రవేశించింది. చాలా సేపు అది శివలింగంపైన ఎక్కి పడగ విప్పి కూర్చుంది. అక్కడి భక్తులు నాగు పామును చూస్తూ పూజలు చేశారు.
మరికొన్ని ఘటనలు కూడా..
ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో మరికొన్ని జరిగాయి. కొన్ని రోజుల క్రితం శనీ సింగ్నాపూర్ లోని ఒక ఆలయంలో పిల్లి దేవుడి ఆలయం చుట్టుచాలా సేపు తిరిగింది. అదే విధంగా ఒక ఆంజనేయ స్వామి ఆలయంలో కోతి గదను పట్టుకుని హనుమంతుడి విగ్రహాం దగ్గర చాలా సేపు అలానే కూర్చుంది. మరోవైపు ఇటీవల ఒక ఎలుగు బంటి శివలింగం పైకెక్కి.. అచ్చం మార్కెండేయుడిలా గట్టిగా పట్టేసుకుంది.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.