
Hyderabad, Feb 3: హైదరాబాద్ (Hyderabad) ట్యాంక్ బండ్ (Tankbund) ఒడ్డున ప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో తెలంగాణ నూతన సచివాలయంలో (Telangana New Secretariat) అగ్ని ప్రమాదం (Fire Accident) వార్తలు కలకలం సృష్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం భవనం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి సచివాలయాన్ని పరిశీలించారు. అయితే, అగ్ని ప్రమాదంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. కేవలం మాక్ డ్రిల్ అని చెబుతున్నారు. సచివాలయ భద్రతా సిబ్బంది కూడా మాక్ డ్రిల్ లో భాగంగా మంటలు వచ్చాయని అంటున్నారు.