Hyderabad, Aug 22: తెలంగాణలో (Telangana) మొత్తం ఓటర్ల సంఖ్య (Voters) 3.06 కోట్లకు చేరుకున్నట్లు ఎన్నికల సంఘం (State Election Commission) తెలిపింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇందులో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు, ఇతరులు 2,133 మంది ఉన్నారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2,742 మంది ఎన్నారైలు, సర్వీస్ ఓటర్లు 15వేలకు పైగా ఉన్నారు.
3.06 crore - total number of voters in #Telanqana . CEO Telangana published draft electoral rolls
4.76lakh voters in 18-19years age group
Serilingampalli and Qutubullapur have highest voters of 6.62lakh and 6.39lakh
Bhadrachalam and Aswaraopet have lowest voters with 1.44lakh… pic.twitter.com/pi2Db3hszZ
— Naveena (@TheNaveena) August 21, 2023
హైదరాబాద్ లో ఇలా..
హైదరాబాద్‌లో 40 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈవో తెలిపారు. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.56 లక్షలు, అత్యల్పంగా చార్మినార్‌లో 2.16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.