Hyderabad, June 08: టెట్ హాల్‌టికెట్లపై (TET Hall ticket) అభ్యర్థుల ఫొటో, సంతకం లేకుంటే.. అటెస్టేషన్ తప్పనిసరి అని టెట్ కన్వీనర్ రాధారెడ్డి స్పష్టం చేశారు. ఫొటో, సంతకం సరిగాలేకపోయినా, అసలు లేకపోయినా సదరు అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఇటీవలే తీయించుకున్న ఫొటోను (Photo) అతికించి గెజిటెడ్ (Gazetted Officer) అధికారిచే అటెస్టేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఆధార్‌కార్డు లేదా ఇతర ఐడీకార్డుతో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)ను సంప్రదించాలి. డీఈవో (DEO)పరిశీలన అనంతరమే అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తామన్నారు. ఇక పేరులో అక్షరదోషాలు, తల్లి, తండ్రి పేరు పుట్టిన తేదీ, కులం, లింగం(Gender), పీహెచ్‌సీ (PHC) వంటి వివరాలను సరిగా లేనిచో ఎగ్జామ్ సెంటర్‌లో (Exam center) నామినల్‌రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో వాటిని సరిచేసుకోవచ్చని రాధారెడ్డి సూచించారు.
ఈ నెల 12వ తేదీన జరిగే టెట్ ఎగ్జామ్‌కు (TET Exam) ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు అనుమతించమన్నారు. కావున అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, కనీసంగా గంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని, ప్రశ్నపత్రాలను జిల్లాలకు చేరుస్తున్నామన్నారు.
ఈ నెల 12 న జరిగే టెట్ ఎగ్జామ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 6లకల మంది టెట్ ఎగ్జామ్ రాయనున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు.