Ex-mla-shakeel-son-booked-over-praja-bhavan-incident

Hyd, Jan 9: పంజాగుట్ట కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో (Panjagutta Car Accident Case) బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్‌ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశించింది. అయితే ఈ నెల 17న సోహైల్‌ (Former MLA Shakeel Son Sahil) పోలీసుల ముందు హాజరు కావాలని తెలిపింది. పంజాగుట్ట కారు ప్రమాద కేసు వివరాలు సమర్పించాలని తెలిపింది. పంజాగుట్ట ప్రజాభవన్‌ వద్ద తనపై నమోదైన ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు కేసు కొట్టివేయాలని సోహైల్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించింది.

ప్రజా భవన్‌ వద్ద బారికేడ్లను ఢీ కొట్టింది బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకే, వివరాలను వెల్లడించిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్

ర్యాష్ డ్రైవింగ్ కేసుకే ఎల్‌వోసీ జారీ చేశారని.. సాహిల్‌పై 15 కేసులు ఉన్నట్టు చూపించారని సాహిల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.మరి చేయని తప్పుకి దుబాయ్ ఎందుకు వెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది. తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారనే భయంతోనే దుబాయ్‌కు వెళ్లినట్లు సాహిల్ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసును పక్కదోవ పట్టించిన పంజాగుట్ట సీఐ దుర్గారావు సస్పెండ్‌, భోదన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సొహైల్‌పై లుక్ అవుట్ నోటీసులు

కాగా పంజాగుట్టలోని ప్రజాభవన్‌ వద్ద గత డిసెంబర్‌ 23న సోహైల్‌ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజాభవన్‌ ముందున్న బారికేడ్లను సోహైల్‌ కారు ఢీ కొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. ఘటన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు సోహైల్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. దీనిపై విమర్శలు రావడంతో పంజాగుట్ట సీఐని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. అప్పటికే దుబాయ్‌ పారిపోయిన సోహైల్‌ను అరెస్టు చేసేందుకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.