Representative Image

Kovvur, April 04: పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో (Road Accident) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనంను లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు (KGH) తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు. అయితే, ఈ ప్రమాదంలో మృతులు హనుమంతు ఆనందరావు (45), హనుమంతు శేఖర్ రావు (15), చింతాడి ఇందు (65)గా గుర్తించారు.

Visakhapatnam Shocker: విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య  

అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. లోయలోకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. పాడేరు ఘాట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో లోయలోకి దూసుకెళ్లిన సమయంలో వాహనంలో 30 మంది కూలీలు ఉన్నారు. వీరిలో బాలిక మృతి చెందగా. పలువురు కూలీలకు గాయాలైనట్లు తెలిసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.