Hyderabad, DEC 28: ప్రజాపాలనకు (Praja Palana) తొలిరోజు భారీ స్పందన లభించింది. ఒక్కరోజులో మున్సిపాలిటీలు (Muncipalities), కార్పొరేషన్లలోనే 81,964 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఆరు గ్యారెంటీలకు 79,110.. ఇతర దరఖాస్తులు 2854 అందాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు, 2358 కార్పొరేషన్లలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
కాగా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసే సమయంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే రాష్ట్రస్థాయి కంట్రోల్ రూం నెంబర్ 040 23120410కు ఫోన్ చేయవచ్చని సూచించారు. అలాగే దరఖాస్తు ఫారం emunicipal.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.