PM Modi (Photo-Video Grab)

Hyderabad, JAN 07: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఈనెల 19న హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో (Secunderabad railway station) వందే భారత్‌ ట్రైన్‌ ను (Vande Bharat Express) జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం భారతీయ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందే భారత్‌ రైలు సికింద్రాబాద్- విజయవాడ (Secunderabad from Vijayawada) మధ్య పరుగులు పెట్టనుంది. దీంతో పాటు మరికొన్ని రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వీలుగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. కాజీపేటలో (Kazipet) నిర్మించ తలపెట్టిన పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్‌ పనులను రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కొద్ది రోజుల క్రితమే ఖరారు చేసింది. ఆ పనులకు ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశముంది.

Rahul Gandhi Trolled: ఒంటి మీద చొక్క లేకుండా చిన్నారి బాలుడిని 4 డిగ్రీల చలిలో వాకింగ్ చేయించిన రాహుల్ గాంధీ, అంటూ ట్రోల్ చేస్తున్న బీజేపీ ఐటీ సెల్.. 

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు సంబంధించి రూ.700 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయి. ఈ పనులు ప్రధానిమోదీ చేతులమీదుగా ప్రారంభించేలా రైల్వేశాఖ ఆలోచన చేస్తోంది. సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రెండో లైన్ పనులు పూర్తయినందున ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఉంది.

Telangana: బండి సంజయ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరింపు, కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 

వందే భారత్ రైలుతో పాటు ఈ 3 పనులకు కూడా రైల్వే శాఖ (Railway) శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. వీటి ప్రారంభం తర్వాత మోదీ బహిరంగసభ కూడా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.