Polling (Photo-PTI)

Hyderabad, NOV 24: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. పోలింగ్‌కు (Telangana Polls) సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు ఒపినియన్స్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. తాజాగా రాజ్‌నీతి సర్వే (Rajneeti Opinion Poll Survey) సైతం తన సర్వే నివేదికను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజ్‌నీతి ఒపీనియన్‌ పోల్ (Rajneeti Opinion Poll) స్పష్టం చేసింది. అధికార బీఆర్‌ఎస్‌కు (BRS) 75 స్థానాలు వస్తాయని.. 4243శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress) మరోసారి రాష్ట్రంలో పరాభావం తప్పదని, ఆ పార్టీ 31 స్థానాలకే పరిమితమవుతుందని చెప్పింది. ఆ పార్టీకి 32.62శాతమే ఓట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ఇక బీజేపీ (BJP) కేవలం ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచే సూచనలున్నాయని సర్వే తెలిపింది. ఆ పార్టీకి 16.71శాతం మాత్రమే ఓట్లు పడుతాయని తెలిపింది. ఇక ఎంఐఎం పార్టీకి ఏడు సీట్లు దక్కుతాయని, ఒక స్థానంలో ఇతరులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

Telangana: తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్, రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్, ఎన్నిక‌ల ముందు రైతుల‌కు బిగ్ రిలీఫ్ 

రాజ్‌నీతి సర్వేపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు (KTR) సోషల్‌ మీడియాలో స్పందించారు. సర్వేను స్వాగతించిన ఆయన.. ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. #TelanganaWithKCR అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. రాజ్‌నీతి రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. 38,351 మంది అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది.

KCR Parade Ground Meeting Postponed: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ వాయిదా.. రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన కారణంగానే నిర్ణయం 

రైతులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, బస్సు, ఆటో డ్రైవర్లు, పక్కా ఇండ్ల యజమానులు, ఇతరులుగా కేటగిరిలుగా విభజించి.. తొమ్మిది వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. అన్ని సామాజిక వర్గాలు, అన్ని వయసులున్న వారి అభిప్రాయాలను తీసుకొని.. వాటిని క్రోడీకరించి నివేదిక తయారు చేసినట్లు వివరించింది. ఇప్పటికే న్యూస్‌టాప్‌, ఇండియా టీవీ, ఫ్యాక్ట్స్‌ మార్కెటింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ సంస్థ పలు సంస్థలు నిర్వహించిన సర్వేలు సైతం బీఆర్‌ఎస్‌దే అధికారమని ఘంటాపథంగా చెప్పాయి.