Guidelines For Adjustment Of VRA's: ఈ నెల 5వ తేదీలోగా వీఆర్ఏల సర్ధుబాటు, మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇతర జిల్లాల్లోనూ సర్దుబాటు చేసేందుకు కసరత్తు
CM KCR with VRAs (Photo-Twitter)

Hyderabad, Aug 02: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 20,555 మంది వీఆర్ఏలను (VRA) క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్హత ఆధారంగా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వేతనాలను వారికి వర్తింపజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్ఏలంతా (VRA's) మినిమమ్ క్వాలిఫికేషన్ ఉన్న వారే. కొందరికి ఏడో క్లాస్ అర్హత ఉంది. మరికొందరికి డిగ్రీ అర్హత ఉంది. వారి విద్యార్హతలను బట్టి పోస్టులను నిర్ధారిస్తారు. తాజాగా, వీఆర్ఏల క్రమబద్ధీకరణ (VRA's Regularization), సర్దుబాటు ప్రక్రియలో భాగంగా మాతృ జిల్లాలో తగినన్ని ఖాళీలు లేకపోతే పొరుగు జిల్లాకు వారిని పంపనున్నారు. విద్యార్హతలను అనుసరించి జిల్లాలో ఉన్న ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. ఈ మేరకు పూర్తి బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు.

ఇదిలాఉంటే, వీఆర్ఏ‌ల వయస్సు 61ఏళ్లు పైబడిఉంటే వారి వారసులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం వీఆర్‌ఏలలో 16,758 మంది 61ఏళ్లలోపు వారు ఉన్నారు. ఆపై వయస్సున్న వారు 3,797 మంది ఉన్నారు. వీఆర్ఏల వయస్సు నిర్ధారణకు తుది గడువును 1జూలై 2023 గా నిర్ణయించారు. వారసుల్లో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనే దానిపై దరఖాస్తులతో పాటు అఫిడవిట్, కుటుంబ సభ్యుల నుంచి నిరభ్యంతర పత్రం తప్పనిసరిగా స్వీకరించాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది.

Hyderabad Airport: రెండు విమానాశ్రయాలున్న నగరాల జాబితాలో హైదరాబాద్ చేరే అవకాశం, హకీంపేటలో పౌరవిమాన సర్వీసులు ప్రారంభించే దిశగా రాష్ట్ర సర్కారు కసరత్తు.. 

అంతేకాదు, దీనికి సంబంధించిన అఫిడవిట్, కుటుంబ సభ్యుల నుంచి ఎన్వోసీ పత్రం వంటిని సేకరించనున్నారు. వాటితోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, విద్యార్హతల ధృవపత్రాలు, ఎన్వోసీలు, కుల, ఆదాయ ధృవపత్రాలు, ఆధార్ కార్డు వంటివి కూడా ప్రతి వీఆర్ఏ జత చేయాల్సి ఉంటుంది. కారుణ్య నియామకపు పత్రాలన్నింటినీ పరిశీలించిన తరువాతే ఉద్యోగాల కేటాయింపు ఉంటుంది. ఇదిలాఉంటే వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ మొత్తం ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాలని నవీన్ మిట్టల్ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Rain Alert For TS: ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, రాబోయే రెండు రోజుల పాటూ తెలంగాణలో మోస్తరు వర్షాలు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు వర్షసూచన 

ఒకవేళ ఇతర జిల్లాలకు కేటాయిస్తే ఆ జాబితాను విడుదల చేయాలని నవీన్ మిట్టల్ తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఆ జిల్లా కలెక్టర్‌కి రిపోర్ట్ చేయొచ్చు. నియామకపు ఉత్తర్వులు జారీకాగానే వీఆర్ఏలను వెంటనే ఆయా మండల తహసీల్దార్లు వారిని రిలీవ్ చేయాలని చెప్పారు. ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఎలాంటి సిఫారసులు చెల్లవు. వారికి కేటాయించినట్లుగా రిపోర్టింగ్ ఆఫీసర్ కు రిపోర్ట్ చేయాల్సిందేనని నవీన్ మిట్టల్ తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.