Hyderabad, OCT 22: సద్దుల బతుకమ్మ వేడుకలు (Saddula Bathukamma ) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పితృ అమావాస్య రోజున ఎంగిలిపూలతో ప్రారంభమైన వేడుకలు.. సద్దులతో ముగిశాయి. తంగేడు, గునుగు, పట్టుగుచ్చులు తదితర తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. తర్వాత గౌరమ్మను చేసి.. పసుపు కొమ్ము, వక్కతో పాటు గౌరమ్మను చేసి బతుకమ్మలో (Saddula Bathukamma ) పెట్టి పూజించారు. సాయంత్రం బతుకమ్మలను కూళ్ల వద్దకు చేర్చి.. ఉయ్యాల పాటలు పాడుతూ.. రాగయుక్తమైన పాటలకు లబద్ధంగా తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. ఎక్కడ చూసినా చౌరస్తాలన్ని బతుకమ్మలతో నిండిపోయాయి. తీరొక్క పూలతో పేర్చిన అనంతరం గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చి.. గౌరమ్మను పూజించి వెళ్లి రావే బతుకమ్మ అంటూ గంగమ్మ ఒడికి సాగనంపారు.
తెలంగాణ పూల పండుగ #బతుకమ్మ వేడుకల ముగింపు రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. #Bathukamma pic.twitter.com/7b60LvUQG9
— Telangana CMO (@TelanganaCMO) October 22, 2023
హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో అంగరంగ వైభవంగా సద్దుల వేడుకలు జరిగాయి. జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొని మహిళలతో కలిసి కోలాటం ఆడారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల, సూర్యాపేట సద్దల చెరువు వద్ద మినీ ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన సంబురాల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. పలుచోట్ల నేతలు పాల్గొని మహిళలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.