Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసు, ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Kalvakuntla Kavitha | File Image

Hyd, Mar 27: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై విచారణను మూడువారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్‌.. విచారణ వాయిదా వేసింది. గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు ఈ కేసును ట్యాగ్‌ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఉచిత వైపైతో నేటి నుంచే టీఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులు, లహరి బస్సుల్లో టికెట్ ధరలు, బస్సు సౌకర్యాలు ఓ సారి తెలుసుకుందామా..

సోమవారం ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. కవిత తరపున సీనియర్‌ ​లాయర్‌ కపిల్‌ సిబల్‌ వాదించారు. కవితకు నోటీసులు ఇచ్చే క్రమంలో ఈడీ నియమాలు, నిబంధనలు పాటించలేదు. ఆమెకు ఇచ్చిన నోటీసుల్లో.. ఇన్వెస్టిగేషన్‌కు రమ్మని ఆదేశించారు. నిందితురాలు కానప్పుడు ఇన్వెస్టిగేషన్‌కు ఎలా పిలుస్తారని ఈడీ తీరుపై సిబాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కార్యాలయానికి పిలిచే వ్యవహారంలో.. అభిషేక్‌ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను ఓసారి పరిశీలించాలని సిబాల్‌ అన్నారు.

రానున్న మూడు రోజుల్లో వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ.. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ఆపై ఈడీ తరపున న్యాయవాది వాదిస్తూ.. విజయ్‌ మండల్‌ జడ్జిమెంట్‌ పీఎంఎల్‌ఏ (PMLA) కేసుల్లో వర్తించదని, పీఎంఎల్‌ఏ చట్టం కింద ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని గుర్తు చేశారు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 160 ఇక్కడ వర్తించదని ఈడీ వాదించింది. ఆపై లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ, కవితలను ఆదేశిస్తూ. పిటిషన్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం.