Hyderabad, JAN 19: ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir Event) రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.
దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానపత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.