Jagtial, Feb 4: జగిత్యాల (Jagtial) జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతిచెందారు. వెల్గటూరులో శ్వేత ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్వేత మరణ వార్త తెలియగానే ఆమె కుటుంబసభ్యులు, స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకొన్నారు.

ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ

ప్రమాదం జరిగింది ఇలా..

ధర్మారం నుంచి జగిత్యాలకు వస్తుండగా ఎస్సై శ్వేత ప్రయాణిస్తున్న కారు ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్వేతతో పాటు బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా అక్కడికక్కడే మృతిచెందాడు.

నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)