SCR Cancels 17 Trains: రైల్వే ప్రయాణికులకు గమనిక, రేపు,ఎల్లుండి 17 రైళ్లు రద్దు చేసిన ఎస్‌సీఆర్, మరికొన్ని ప్రధాన రైళ్లు భారీ ఆలస్యం, రద్దయిన రైళ్ల పూర్తి వివరాలు ఇవిగో..
IRCTC (Photo-ANI)

సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈనెల 20, 21 తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా.. ఇంకొన్ని ప్రధాన రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడవనున్నాయి.చర్లపల్లి టెర్మినల్‌ వద్ద ఆర్‌యూసీ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 21న ఆ మార్గంలో నడిచే 17 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ నుంచి వరంగల్, రేపల్లె, సిర్పూర్‌ కాగజ్‌గర్, కాచిగూడ నుంచి మిర్యాలగూడ, వికారాబాద్‌ నుంచి గుంటూరు మధ్య నడిచే పలు రైళ్లు రద్దు కానున్నాయి.

 రద్దయిన 17 రైళ్లు వివరాలు ఇవే..

ఈ నెల 21న (ఆదివారం) వరంగల్ -సికింద్రాబాద్‌ (రైలు నంబర్‌ 07757); సికింద్రాబాద్‌ -వరంగల్‌ (07462); వరంగల్‌ - హైదరాబాద్‌ (07463); హైదరాబాద్‌- కాజీపేట(07758); కాచిగూడ -మిర్యాలగూడ (07276); మిర్యాలగూడ-నడికుడి(07277); నడికుడి-మిర్యాలగూడ (07973); మిర్యాలగూడ-కాచిగూడ(07974); సికింద్రాబాద్‌- రేపల్లె(17645); గుంటూరు-వికారాబాద్‌(12747); వికారాబాద్‌-గుంటూరు(12748); హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌(17011); సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- హైదరాబాద్‌(17012); సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్‌ (17234); సికింద్రాబాద్‌- గుంటూరు (17202); గుంటూరు- సికింద్రాబాద్‌ (17201); సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233) రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌. రాకేశ్‌ వెల్లడించారు.

బస్‌స్టాపులో మహిళలు వేచి ఉన్నారు. బస్సు ఆపాలంటూ డ్రైవర్ ను కోరారు. అయితే, బస్సు ఆపని డ్రైవర్.. కేజ్రీవాల్ ఏం చేశారంటే? వీడియో ఇదిగో!

విశాఖపట్నం–కాచిగూడ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌­ప్రెస్‌ రైలును ఈ నెల 20 నుంచి మహబూబ్‌నగర్‌ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు కాచిగూడ–విశాఖ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(12862) 20వ తేదీన మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 4.10 గంటలకు బయల్దేరుతుంది. 6.10కి కాచిగూడ చేరుకుని సాయంత్రం 6.20కి బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(12861) విశాఖలో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.45కి కాచిగూడ చేరుకుంటుంది. తిరిగి 6.55కి బయల్దేరి ఉదయం 9.20 గంటలకు మహబూబ్‌నగర్‌ చేరుకుంటుంది.

ఎల్ఆర్ ఎస్ కిందకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్.. ఆర్బీఐ అనుమతి లేకుండా 2.50 లక్షల డాలర్ల వరకు పంపే వెసులుబాటు.. కేంద్రం నోటిఫికేషన్

ఈ నెల 20న కొన్ని ప్రధాన రైళ్లు గంట నుంచి 3 గంటల పాటు ఆలస్యంగా నడవనున్నాయి. హావ్‌డా- సికింద్రాబాద్‌( రైలు నంబర్‌ 12703) మూడు గంటల పాటు ఆలస్యంగా బయల్దేరనుంది. శనివారం ఉదయం 8.35గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలును ఉదయం 11.35గంటలకు రీషెడ్యూల్‌ చేశారు. అలాగే, భువనేశ్వర్‌-ముంబయి సీఎస్‌ఎంటీ(11020) రైలు కూడా మూడు గంటల ఆలస్యంగా నడవనుంది. సాధారణంగా మధ్యాహ్నం 3.20గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు సాయంత్రం 6.20గంటలకు బయల్దేరనుంది.

త్రివేండ్రం-సికింద్రాబాద్‌ (17229) రైలు 2 గంటలు ఆలస్యం కానుంది. ఉదయం 6.45గంటలకు బయల్దేరే ఈ రైలు శనివారం (మే 20న) ఉదయం 8.45గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 11.20గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం-ముంబయి ఎల్‌టీటీ (18519) రైలు గంట ఆలస్యంగా అర్ధరాత్రి 12.20 నిమిషాలకు బయల్దేరుతుంది. మే 21 (ఆదివారం) రోజు సాయంత్రం 6.50గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్ -మన్మాడ్‌ (17064) రైలు 3 గంటలు ఆలస్యంగా రాత్రి 9.50గంటలకు బయల్దేరనుంది.