Pocharam Flag hoisting (Image Credits: Twitter)

Hyderabad, September 17: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. శాసన సభ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసన మండలి వద్ద చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం అసెబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాలను నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా చార్యులు, పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.