Telangana Congress: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు, కాంగ్రెస్ కండువా కప్పుకున్న టీఆర్ఎస్ జడ్పీటీసీ కాంతారావు...
Flags of Congress Party & TRS Party | Representational Image| File Photo

టీఆర్‌ఎస్ నాయకుడు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ సిట్టింగ్ జెడ్పీటీసీ కాంతారావు శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ యాదవ్‌, అనిల్‌, తదితరులున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌లో చేరే వాళ్లు పెద్దఎత్తున రాబోతున్నారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పోడు భూములకు పట్టాలు ఇస్తామని కేసీఆర్‌ ఎన్నికల్లో గెలుపొందారని, కానీ కేసీఆర్‌ పోడు భూముల రైతుల సంగతి మర్చిపోయారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వందలాది మంది గిరిజనులపై కేసులు పెట్టిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజనులను పట్టించుకోవడం లేదన్నారు. పింఛన్లు సకాలంలో ఇవ్వడం లేదని, పోలీసు శాఖకు జీతాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ నేతలు అన్నారు.

ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు అలర్ట్, ఆగస్టు 3 నుంచి 12 వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, విడుదలైన ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు మొత్తం అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌కే చెందుతాయని ఘంటాపథంగా చెప్పారు. తాటి వెంకటేశ్వర్లు, కాంతారావు కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ మరింత బలోపేతం కానుంది. 11 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్నారు. రైతు డిక్లరేషన్ అమలులోకి వస్తే రైతుల బతుకులు మారుతాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయి పేదల ప్రభుత్వం రావాలి. త్వరలో అశ్వారావుపేటలో పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. చాలా మంది పార్టీలో చేరుతారని, కాంగ్రెస్‌లో చేరికల పర్వం మొదలైందని పేర్కొన్నారు.