Tammineni veerabhadram (photo-Wikimedia Commons)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం బైబై చెప్పి ఒంటరి పోరుకు సిద్ధమైంది. 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.తాజాగా 17 మందితో కూడిన సీపీఎం అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం గురువారం ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, మెదక్‌, హైదరాబాద్‌ జిల్లాలో సీపీఎం పోటీ ఉంటుందని తమ్మినేని వెల్లడించారు. భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్‌, భువనగిరి, హూజుర్‌నగర్‌, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్‌తో కూడిన జాబితాను విడుదల చేశారు.

ఆందోల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బాబూ మోహన్ పోటీ, 35 మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ మూడో జాబితా ఇదిగో..

భద్రాచలంలో 8సార్లు వరుసగా గెలిచామని తమ్మినేని తెలిపారు. పాలేరు, భద్రాచలం సీటు కావాలని తాము పట్టుపడితే కాంగ్రెస్ ఇవ్వలేదని మండిపడ్డారు. భద్రాచలం, సత్తుపల్లి, పాలేరు సిట్టింగ్‌ కాబట్టి ఇవ్వబోమన్నారని తెలిపారు. వైరా, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో ఇస్తామని చెప్పారన్నారు. తాము అడిగిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే సీట్లకు చెప్పినా కూడా పొత్తు విషయంలో కాంగ్రెస్‌ మాట మార్చిందని దుయ్యబట్టారు.

CPM First List

తమకు ఇస్తామన్న సీట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో కలిసి ఉండాలా విడిపోవాలా అన్నది సీపీఐ ఇష్టమని తమ్మినేని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్‌ సీపీఐకి రెండు టికెట్లు ఇస్తే.. అక్కడ పోటీ పెట్టబోమని తెలిపారు. సీపీఐ నిలబడే స్థానాల్లో వారికే సీపీఎం మద్దతిస్తుందన్నారు.