New assembly building in Telangana soon!(X)

Hyderabad, DEC 01: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలు, కులగణన వివరాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ సమావేశాల్లో.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అటకెక్కించడంపై ఆసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది.

CM Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్...సంక్రాంతి తర్వాత రైతు భరోసా, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, విధి విధానాలు త్వరలో వెల్లడి 

రైతు భరోసా విధివిధానాలపై అసెంబ్లీలో చర్చిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ఉదయం ఒక ప్రకటన చేశారు. కులగణన వివరాలపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ ఏడాది పాలన తనకు సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ప్రకటించారు.