Telangana Assembly Sessions Update.. BRS MLAs Vs Congress MLAs(X)

Hyd, December 18:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ఆటో డ్రైవర్ల సమస్యపై చర్చించాలని పట్టుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందించేందుకు పాలకులు కమీషన్లు దండుకుంటున్నారని వివేకానంద చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ దే కమీషన్ల ప్రభుత్వం అని...గొర్రెల పంపిణీ పథకం నుంచి మొదలుపెడితే దళిత బంధు స్కీమ్‌ వరకు వేల కోట్లను బీఆర్ఎస్ నేతలు వసూలు చేశారు అని మండిపడ్డారు.

ఈ క్రమంలో BRS MLA కౌశిక్‌రెడ్డిపై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. స‌భ‌లో మీ ప్ర‌వ‌ర్త‌న మార్చుకోక‌పోతే స‌స్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

కేటీఆర్.. ఇదేం పద్దతి, అనవసర రాద్దాంతం చేసి.. సభా సమయాన్ని వృధా చేయొద్దన్నారు స్పీకర్. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, గొడవ పెడితే.. మైక్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు స్పీకర్. 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 

మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తులు.. జూనియర్ సభ్యులకు నేర్పించేది ఇదేనా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు క్లియర్ చేయాలంటే 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు వివేకానంద. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.

Telangana Assembly Sessions...BRS Vs Congress

వివేకానంద తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని...నోటీసులు లేకుండా ఇతరలుపై మాట్లాడవద్దని మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు. ఆటో డ్రైవర్లను కూడా బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉంటే ఒకలాగ.. లేకపోతే మరోలా ఉంటున్నారన్న ఆరోపించారు. ఇక అంతకముందు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కేటీఆర్ స్వయంగా ఆటో నడిపారు.