Telangana: పోలవరంతో భద్రాచ‌లానికి పెను ముప్పు, సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాలని డిమాండ్
Minister Puvvada Ajay Kumar (Photo-Twitter)

Hyd, July 19: తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌ (telangana minister puvvada ajay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుతో భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి ఉంద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రాథ‌మిక డిజైన్ మార్చి మూడు మీట‌ర్లు ఎత్తు పెంచుకున్నారు.. దీని వ‌ల్లే భ‌ద్రాచ‌లానికి వ‌ర‌ద వ‌చ్చింద‌న్నారు. ఎత్తు త‌గ్గించాల్సిన బాధ్య‌త కేంద్రం మీద ఉంద‌ని మంత్రి పేర్కొన్నారు. వ‌ర‌ద‌ల నివార‌ణ‌కు ఆ ప్రాజెక్టు (Polavaram Reservoir Project) ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చొర‌వ చూపాల‌న్నారు.

భ‌ద్రాచ‌లం ఇరు వైపులా క‌ర‌కట్ట‌ల‌ను ప‌టిష్టం చేసేందుకు, ముంపు బాధితుల‌ను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) ప్ర‌క‌టించిన చ‌ర్య‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నామ‌ని మంత్రి (Minister Puvvada Ajay Kumar ) తెలిపారు. రూ. 1000 కోట్ల‌తో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన కేసీఆర్‌కు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా త‌ర‌పున ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు చెబుతున్నామ‌ని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామ‌ని మంత్రి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ఉన్న ముప్పును నివారించాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి త‌మ‌ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని గుర్తు చేశారు.

ఏపీ ఆదాయం తగ్గింది..ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా? తెలంగాణ మంత్రి పువ్వాడ పోలవ‌రం ప్రాజెక్టు వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఏపీ మంత్రి బొత్స

పోలవ‌రం కోసం తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్రాలో క‌లిపిన‌ప్పుడు తాము నిర‌స‌న తెలిపామ‌న్నారు. ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాలి. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో పెట్టి ఆమోదించాల‌ని కోరారు. ముఖ్యంగా భ‌ద్రాచ‌లం ప‌క్క‌నే ఉన్న 5 గ్రామాలను తెలంగాణ‌లో క‌ల‌పాలి. ఆ ఐదు గ్రామాల అంశంపై కేంద్రం ఆలోచించాల‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ సూచించారు.దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.