Telangana Budget 2023: రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌, 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు
Harish Rao (Photo-Video Grab)

Hyd, Feb 6: ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను శాసనసభలో ప్రవేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్‌ను హ‌రీశ్‌రావు చ‌దివి వినిపిస్తున్నారు. స‌భ‌లో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. నిరుడు మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

బడ్జెట్ హైలెట్స్

షెడ్యూల్‌ తెగలకు రూ.15, 233 కోట్లు

►బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు

►దళితబంధుకు రూ. 17 వేల 700 కోట్లు

►ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు

►రైతు వేదికలకు రూ. 26 835 కోట్లు

►నీటి పారుదల రంగానికి రూ. 26, 831 కోట్లు

►విద్యుత్‌ రంగానికి రూ.12, 727 కోట్లు

►ప్రజాపంపిణీ రంగానికి రూ. 3117 కోట్లు

►2023-24 తలసరి ఆదాయం రూ. 3 లక్షల 17 వేల 175

►రెవెన్యూ వ్యయం రూ. 2,11, 685 కోట్లు

►మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు