Minister Harish Rao (Photo-Video Grab)

Hyd, Feb 6: 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను (Telangana Budget 2023) ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. గతేడాది మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2023 బడ్జెట్‌ దస్త్రాలతో మంత్రి హ‌రీశ్‌రావు (Finance Minister T Harish Rao) ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు.అసెంబ్లీ దగ్గర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా.. అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముందుకు వెళ్తున్నదని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు.

నాందేడ్ లో బీఆర్ఎస్ సభ 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం ఇచ్చిన కేసీఆర్, తెలంగాణ వెలుపల తొలి సభ సక్సెస్, ఇక దేశ వ్యాప్తంగా సభలకు సిద్ధం..

సంక్షేమ పథకాలు ఆగకూడదన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనతో బడ్జెట్‌ కేటాయింపులు చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలోనూ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు. బడ్జెట్‌కు కేబినెట్‌తోపాటు గవర్నర్‌ ఆమోదం కూడా లభించిందని వెల్లడించారు. మండలిలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని చెప్పారు.