Uttam Kumar Reddy (photo-Video Grab)

Hyderabad, Aug 9: కొత్త రేషన్ కార్డుల (Telangana New Ration Cards) కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను (Health Cards) వేర్వేరుగా జారీ చేయడానికి, అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సబ్ కమిటీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డు లబ్దిదారుల ఎంపికపై అధ్యయనం చేసి అవసరమైన విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.

పారిస్ ఒలింపిక్స్‌ లో మెరిసిన నీరజ్ చోప్రా.. రజతాన్ని ముద్దాడిన బల్లెం వీరుడు.. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించిన ధీరుడు.. ప్రధాని మోదీ ప్రశంసలు

వేర్వేరు కార్డులు ఎందుకు?

ప్రస్తుతం రేషన్ కార్డు లబ్దిదారులకే ఉచిత ఆరోగ్య వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారని నివేదికలు చెప్తున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం రేషన్ కార్డు, హెల్త్ కార్డు లింక్‌ ను తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.

‘బ్రేక్’ థీమ్ తో వినూత్నంగా నేటి గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

కమిటీలో వీళ్లే..

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్‌ కమిటీకి చైర్మన్‌ గా వ్యవహరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ఉంటారు.

భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం