KCR Jagan Meet: సరదాగా ముచ్చటించుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, పోచారం మనువరాలి పెళ్లికి హాజరైన కేసీఆర్, జగన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు మరోసారి కలుసుకకున్నారు. ఈ సారి వారు అధికారిక సమావేశం కోసం కాకుండా, ఓ పెళ్లి వేడుకలో కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటూ ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. శంషాబాద్‌లో జరిగిన వివాహ వేడుకలో ఇరువురు సీఎంలు వధూవరులను ఆశీర్వదించారు.
Hyderabad November21: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు మరోసారి కలుసుకకున్నారు. ఈ సారి వారు అధికారిక సమావేశం కోసం కాకుండా, ఓ పెళ్లి వేడుకలో కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటూ ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. శంషాబాద్‌లో జరిగిన వివాహ వేడుకలో ఇరువురు సీఎంలు వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మనవరాలిని ఏపీ సీఎం జగన్ ఓఎస్డీ పీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించారు. దాంతో శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫార్మ్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఇద్దరు సీఎంలు కలిశారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని వివాహ తంతును వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వరుడు రోహిత్ రెడ్డి, వధువు స్నిగ్ధ రెడ్డిలను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల నీటి వివాదాల అనంతరం తొలిసారి రెండు రాష్ట్రాల సీఎంలు కలిశారు. దీంతో వారి భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
(The above story first appeared on LatestLY on Nov 21, 2021 04:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

