Telangana CM Revanth Reddy attends Global AI conference at Hyderabad

Hyd, Sep 5:  హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుండగా దేశ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఏఐ సదస్సు జరుగుతోంది. సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఈ సదస్సు జరగనుంది.

ప్రపంచం నలుమూలల నుంచి AI రంగంలో పేరొందిన ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఏఐ రంగంలో అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, ఐబీఎం నుంచి డానియెలా కాంబ్, ఎక్స్‌ ప్రైజ్ ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సు కు హాజరయ్యారు.

ఈ సదస్సు ద్వారా ఏఐ రంగం అభివృద్ధి కి తమ ఆలోచనలను పంచుకుంటారు. భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి - ఈటల రాజేందర్‌ ఫన్నీ సంభాషణ, ఫోటోలు మంచిగ రావాలని కామెంట్, ఈటలపై సరదా జోకులు...వీడియో

Here's Tweet:

హైదరాబాద్ లో నిర్మించనున్న ఫోర్త్ సిటీ లో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా AI సిటీ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో AI సేవలను అబివృద్ధి అవకాశాల తో.. భవిష్యత్తు కార్యాచరణ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ ను రూపొందించింది ప్రభుత్వం. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు.