Telangana Assembly Elections 2023 Winning Candidates List: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అధికార ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత వెలుబడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు.
బీఆర్‌ఎస్ ఇప్పటికి 39 స్థానాలకు పరిమితం కావడంతో శ్రేణుల్లో నిరాశలో కూరుకుపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వెలుబడుతున్న స్పష్టమైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మొగ్గుచూపుతున్నాయి.ఇక హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. పలు నియోజకవర్గాల్లో లీడింగ్ దశలో ఉంది. హైదరాబాద్‌లో నాలుగు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. రెండు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
అలాగే గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించగా.. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. అటు ఎంఐఎం పార్టీ అభ్యర్థులు కూడా మూడు స్థానాల్లో విజయం సాధించారు. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు పూర్తి వివరాలు ఇవిగో..
హైదరాబాద్‌లో ఎన్నికల ఫలితాలు
ఖైరతాబాద్ - బీఆర్ఎస్ - ఆధిక్యం
జూబ్లీహిల్స్ - బీఆర్ఎస్ - ఆధిక్యం
సనత్ నగర్ - బీఆర్ఎస్ - విజయం
సికింద్రాబాద్ - బీఆర్ఎస్ - విజయం
కంటోన్మెంట్ - బీఆర్ఎస్ - విజయం
అంబర్ పేట - బీఆర్ఎస్ - విజయం
గోషామహల్ - బీజేపీ - విజయం
కార్వాన్ - బీజేపీ - ఆధిక్యం
ముషీరాబాద్ - బీఆర్ఎస్ - ఆధిక్యం
నాంపల్లి - ఎంఐఎం - ఆధిక్యం
చార్మినార్ - ఎంఐఎం - విజయం
బహదూర్ పురా -ఎంఐఎం - విజయం
చాంద్రయణగుట్ట - ఎంఐఎం - విజయం
మలక్ పేట్ - ఎంఐఎం - ఆధిక్యం
యాకత్ పురా - ఎంఐఎం - ఆధిక్యం
ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు
ఎల్బీనగర్ : సుధీర్ రెడ్డి (బీఆర్ఎస్)
బోధ్: అనిల్ జాదవ్ బీఆర్ఎస్
అచ్చంపేట: చిక్కుడు వంశి కృష్ణ (కాంగ్రెస్)
ఆదిలాబాద్: పాయల్ శంకర్ (కాంగ్రెస్)
అలేరు: ఐలయ్య బీర్ల (కాంగ్రెస్)
అలంపూర్: విజయుడు (బీఆర్‌ఎస్)
అంబర్‌పేట: కాలేరు వెంకటేశ్
ఆందోల్: దామోదర రాజనర్సింహ గెలుపు
ఆర్మూర్: పైడి రాకేష్ రెడ్డి (బీజేపీ)
ఆసిఫాబాద్: కోవా లక్ష్మి (బీఆర్‌ఎస్)
అశ్వారావుపేట: ఆదినారాయణ జారే (కాంగ్రెస్)
బాల్కొండ: వేముల ప్రశాంత్ రెడ్డి (బీఆర్‌ఎస్)
బాన్సువాడ: శ్రీనివాస్ రెడ్డి (బీఆర్‌ఎస్)
బెల్లంపల్లి : గడ్డం వినోద్ (కాంగ్రెస్)
భద్రాచలం: తెల్లం వెంకటరావు(బీఆర్‌ఎస్)
భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్)
భోథ్: అనిల్ జాదవ్ (బీఆర్‌ఎస్)
బోధన్: పి. సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్)
చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ (ఎంఐఎం)
చార్మినార్: జుల్ఫికర్ అలీ (ఎంఐఎం)
చెన్నూరు: గడ్డం వివేక్ (కాంగ్రెస్)
మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డి
చొప్పదండి: మేడిపల్లి సత్యం (కాంగ్రెస్)
దేవరకొండ: బాలూ నాయక్ (కాంగ్రెస్)
దేవరకద్ర: జీ మధుసూదన్ రెడ్డి( కాంగ్రెస్ )
ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్)
డోర్నకల్: జాటోత్ రామ్ చందర్ నాయక్ (కాంగ్రెస్)
దుబ్బాక: కొత్త ప్రభాకర్ రెడ్డి (బీఆర్‌ఎస్)
గద్వాల్: సంఘం కృష్ణమోహన్ రెడ్డి (బీఆర్‌ఎస్)
గజ్వేల్: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (బీఆర్‌ఎస్)
స్టేషన్ ఘన్‌పూర్: కడియం శ్రీహరి (బీఆర్‌ఎస్)
గోషామహల్: రాజా సింగ్ (బీజేపీ)
హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్)
హుజూరాబాద్: కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్)
హుజూర్‌నగర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
ఇబ్రహింపట్నం: మల్రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్)
జడ్చర్ల: అనిరుధ్ రెడ్డి జనంపల్లి (కాంగ్రెస్)
జగిత్యాల్: జీవన్ రెడ్డి (కాంగ్రెస్)
జనగాం: పల్లా రాజేశ్వర్ రెడ్డి (బీఆర్‌ఎస్)
జూబ్లీ హిల్స్: మాగంటి గోపినాథ్ (బీఆర్‌ఎస్)
జుక్కల్: హన్మంత్ షిండే (బీఆర్‌ఎస్)
కల్వకుర్తి: రాయణరెడ్డి కేసిరెడ్డి (కాంగ్రెస్ )
కామారెడ్డి: వెంకట రమణారెడ్డి (బీజేపీ)
కరీంనగర్:గంగుల కమలకర్(బీఆర్‌ఎస్)
కారవాన్: అమర్ సింగ్(బీజేపీ)
ఖైరతాబాద్: దానం నాగేందర్ (బీఆర్‌ఎస్)
ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు(కాంగ్రెస్ )
ఖానాపూర్: వెడ్మ భోజ్జు(కాంగ్రెస్)
కొడంగల్: అనుముల రేవంత్ రెడ్డి(కాంగ్రెస్)
కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్)
కోరుట్ల: కల్వకుంట్ల సంజయ్ (బీఆర్‌ఎస్)
కొత్తగూడెం: కూనంనేని సాంబశివరావు (సీపీఐ )
కూకట్‌పల్లి: మధవ కృష్ణ రావు (బీఆర్‌ఎస్)
LB నగర్: సుధీర్ రెడ్డి (బీఆర్‌ఎస్)
మధిర: బట్టి వికమర్క (కాంగ్రెస్)
మహబూబాబాద్: డాక్టర్ మురళీ నాయక్ (కాంగ్రెస్)
మహేశ్వరం: పట్లోళ్ల సబితా ఇంద్రా రెడ్డి (బీఆర్‌ఎస్)
మత్కల్: శ్రీహరి (కాంగ్రెస్)
మలక్ పేట: అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా(AIMIM)
మల్కాజిగిరి: మర్రి రాజశేఖర్‌రెడ్డి (బీఆర్‌ఎస్)
మానకొండూరు: కావంపల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)
మంచిర్యాల: కొక్కిరాల ప్రేంసాగర్ రావు (కాంగ్రెస్)
మంథని: దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్)
మెదక్: మైనంపల్లి రోహిత్ (కాంగ్రెస్)
మేడ్చల్: చామకూర మల్లా రెడ్డి (బీఆర్‌ఎస్)
మిర్యాలగూడ: బత్తుల లక్ష్మా రెడ్డి (కాంగ్రెస్)
ముధోల్: రామ్ రావ్ పవార్ (బీజేపీ)
ములుగు: దనసరి అనసూయ (సీతక్క) (కాంగ్రెస్)
మునుగోడు: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (కాంగ్రెస్)
నాగార్జున సాగర్: కుందూరు జయవీర్ (కాంగ్రెస్)
నాగర్ కర్నూల్: మర్రి జనార్దన్ రెడ్డి (బీఆర్‌ఎస్)
నక్రేకల్: వేముల వీరేశం (కాంగ్రెస్)
నల్గొండ: కోమట్‌రెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (కాంగ్రెస్)
నాంపల్లి: మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ (కాంగ్రెస్)
నారాయణఖేడ్: పట్లోళ్ల సంజీవ రెడ్డి (కాంగ్రెస్)
నారాయణపేట: చిట్టెం పర్ణిక రెడ్డి (కాంగ్రెస్)
నర్సంపేట: దొంతి మాధవ రెడ్డి (కాంగ్రెస్)
నర్సాపూర్: వాకిటి సునీత లక్ష్మా రెడ్డి (బీఆర్‌ఎస్)
నిర్మల్: అల్లెటి మహేశ్వర్ రెడ్డి (బీజేపీ)
నిజామాబాద్ (రూరల్): రేకులపల్లి భూపతి రెడ్డి (కాంగ్రెస్)
నిజామాబాద్ (అర్బన్): ధనపాల్ సూర్యనారాయణ (బీజేపీ)
పాలేరు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)
పాలకుర్తి: యశస్విని మామిడాల (కాంగ్రెస్)
పారకాల్: రేవూరి ప్రకాష్ రెడ్డి (కాంగ్రెస్)
పర్గి: టి. రాంమోహన్ రెడ్డి (కాంగ్రెస్)
పటాన్ చెరు: గూడెం మహిపాల్ రెడ్డి (బీఆర్‌ఎస్)
పెద్దపల్లి: చింతకుంట విజయరమణారావు (కాంగ్రెస్)
పనపాక: పాయం వెంకటేశ్వర్లు (కాంగ్రెస్)
కుత్బుల్లాపూర్: K.P. వివేకానంద (బీఆర్‌ఎస్)
రాజేంద్రనగర్: ప్రకాష్ గౌడ్ (బీఆర్‌ఎస్)
రామగుండం: రాజ్ ఠాగూర్ (కాంగ్రెస్)
సనత్‌నగర్: తలసాని శ్రీనివాస్ యాదవ్ (బీఆర్‌ఎస్)
సంగారెడ్డి : ప్రభాకర్ (బీఆర్‌ఎస్)
సత్తుపల్లి: మట్టా రాగమయి (కాంగ్రెస్)
సికింద్రాబాద్: పద్మారావు (బీఆర్‌ఎస్)
సికింద్రాబాద్ (కాంటోన్మేంట్): లాస్య నందిత (బీఆర్‌ఎస్)
షేర్ లింగంపల్లి: అరికెపూడి గాంధి (కాంగ్రెస్)
షాద్‌నగర్: కె శంకరయ్య (కాంగ్రెస్)
సిద్దిపేట: హరీష్ రావు (బీఆర్‌ఎస్)
సిరిసిల్ల: కల్వకుంట్ల తారకరామారావు (బీఆర్‌ఎస్)
సిర్పూర్: డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (కాంగ్రెస్)
సూర్యపేట: జగదీష్ రెడ్డి (బీఆర్‌ఎస్)
తాండూర్: బి మనోహర్ రెడ్డి (కాంగ్రెస్)
తుంగతుర్తి: మందుల సామెల్ (కాంగ్రెస్)
ఉప్పల్: లక్ష్మారెడ్డి (బీఆర్‌ఎస్)
వేములవాడ: ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్)
వికారాబాద్: గడ్డం ప్రసాద్ కుమార్ (కాంగ్రెస్)
వనపర్తి: మేఘా రెడ్డి (కాంగ్రెస్)
వర్ధన్నపేట: కె ఆర్ నాగరాజు (కాంగ్రెస్)
వరంగల్ (తూర్పు): కొండా సురేఖ (కాంగ్రెస్)
వరంగల్ (వెస్ట్): నాయిని రాజేందర్ రెడ్డి(కాంగ్రెస్)
వైరా: రామదాస్ మాలోత్ (కాంగ్రెస్)
యాకుత్పురా: జాఫర్ హుస్సేన్ (AIMIM)
ఇల్లందు: కోరం కనకయ్య (కాంగ్రెస్)
యల్లారెడ్డి: మదన్ మోహన్ రావు (కాంగ్రెస్)
జహీరాబాద్: కొనింటి మాణిక్ రావు (బీఆర్‌ఎస్)