ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day 2022 Wishes) ఆవిర్భవించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం వేరుపడిన సమయంలో.. తెలంగాణ కలిసేందుకు ఒప్పుకోలేదు. కానీ 58 ఏళ్ల పాటు అణచివేతకు గురైంది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు. ఈ సమయంలోనే 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసి.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పెత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ జాతీయ ఎజెండాగా మారింది. ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ దీక్షకు యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29 వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. కేసీఆర్ నిమ్స్‌లో దీక్ష కొనసాగించడంతో... డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు.
మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే..
దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు. అనంతరం 2 జూన్ 2014 న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతోంది Latestly Telugu. ఈ విషెస్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పేయండి.
తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరిస్తూ..అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
ఆత్మగౌరవ ఉద్యమమే ఊపిరిగా..
అరవై ఏళ్ల కల సాకారం కావడంలో
అసువులు బాసిన అమరులను స్మరిస్తూ..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు ఇది.
అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు