Doctor

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖలో కీలక నిర్ణయం తీసుకున్నది. వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా నియమితులయ్యే వైద్యులకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాన్‌ టీచింగ్‌ విభాగం నుంచి టీచింగ్‌ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చేవారు సైతం ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వీస్‌ రూల్స్‌లో ప్రభుత్వం మార్పులు చేయగా.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్‌లు, బయటకు వస్తున్న కీలక అంశాలు, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఫేర్‌ వల్ పార్టీ కోసం రూ. 2లక్షలతో పబ్ బుక్ చేసుకున్నట్లు వెల్లడి

వైద్య విద్య సంచాలకుడి విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి నిబంధన వర్తించదని పేర్కొంది. క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌, సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి (డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ లేదా బదిలీ ద్వారా) కనీస అర్హతలను తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించింది. అందరు స్పెషలిస్టులు, డాక్టర్లు కచ్చితంగా తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.