Hyderabad, DEC 17: తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ (IAS Transfers) చేసింది. ఈ మేరకు ఆదివారం ఆయా అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను (Transfers) విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో పురపాలక ముఖ కార్యదర్శిగా దాన కిశోర్‌ను నియమించింది. అలాగే ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యలు అప్పగించింది. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమించిన ప్రభుత్వం.. ఆయనకు కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది.
అటవీశాఖ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్ బదిలీ చేయగా.. ఆమెకు ఈపీటీఆర్‌ఐ డెరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజును నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు బదిలీ చేయగా.. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషన్‌ర్‌గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేసింది. నల్గొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌ను వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ నియమించింది.