Hyderabad December 26: ఒమిక్రాన్ (Omicron) కట్టడి కోసం కఠిన చర్యలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం (Telangana Government). కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలను(restrictions on New year celebs) విధించింది. హైకోర్టు (High Court)ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు. శనివారం నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, జనవరి 2, 2022 వరకు కొనసాగుతాయని ప్రభుత్వ జీవోలో పేర్కొంది.
రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతులు ఉండవని స్పష్టం చేసింది. ఇక పబ్లిక్ ఈవెంట్స్(events) భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభణ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న తెలంగాణ సర్కార్.. మాస్క్ పెట్టుకోకుంటే కఠిన చర్యలు(Mask Must) తప్పవని పేర్కొంది. ఇక డిసెంబర్ 31 నుంచి జనవరి 2 దాకా ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.
అటు తెలంగాణలో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు(3 More Omicron Cases in Telangana) బయటపడ్డాయి. దీంతో శనివారం నాటికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ వైద్య శాఖ ప్రజలకు సూచిస్తోంది.