Hyderabad, July 22: తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (Arogyasree) చికిత్సకు సంబంధించిన ధరలను సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు లేదని ప్రభుత్వం జీవోలో (GO 30) స్పష్టం చేసింది. అదే సమయంలో కొత్తగా 163 చికిత్సలను చేరుస్తూ (Arogyasree Treatments) నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సగటున 20 నుంచి 20శాతం రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వంపై రూ.438 కోట్ల భారం పడుతుందన్నారు.
Telangana Shocker: అనుమానం పెనుభూతమై, భార్యను - 10నెలల పసికందును చంపిన కసాయి.. చివరికి తాను కూడా?
ఆరోగ్యశ్రీకి సంబంధించి అదనపు ఖర్చు రూ.600 కోట్లు పెరిగిందన్నారు. ట్రస్ట్ ద్వారా దాదాపు 6 లక్షల మందికి బాసటగా ఉందన్నారు. కొత్త ప్రొసీజర్స్‌తో మరో లక్షన్నర కుటుంబాలను ఆదుకోబోతుందన్నారు. ఇదిలా ఉండగా.. ఆరోగ్యశ్రీ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.