Telangana Govt Logo

కొత్త ఏడాది వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఇందులో భాగంగా డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించనున్నట్లు తెలిపింది.ఇక పబ్ లు, క్లబ్ లు, బార్, రెస్టారెంట్లు, హోటళ్లు ఒంటి గంట వరకు తెరచుకునేందుకు అనుమతించనుంది. అయితే, ముందస్తు అనుమతి తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన టాటా ఏస్‌ వాహనం, ఆరుగురు మృతి

ఈ క్రమంలోనే జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ఈ రోజును జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లేవారు , పబ్‌లు, క్లబ్‌లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు. పార్టీలలో డ్రగ్స్ వినియోగం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.