Representative Image (Photo Credits: IANS)

Nizamabad, Dec 18: నిజామాబాద్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఇంటి కోసం (House Dispute) ఇంటిల్లిపాదిని విడివిడిగా ఓ స్నేహితుడు చంపేసినట్లు ( Six members of the same family were Murder) తెలుస్తోంది. ఈ నెల 9 నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్య గురైనట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం మాట్లూరుకు చెందిన మాక్లూర్‌ ప్రసాద్‌ అనే వ్యక్తిని అతని స్నేహితుడు ప్రశాంత్‌ హత్య చేశారు.

తార్నాకలో మహిళపై అర్థరాత్రి గ్యాంగ్‌రేప్‌, లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మబలికి దారుణానికి తెగబడిన కామాంధులు

డిచ్‌పల్లి వద్ద హైవే పక్కన అతని మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్‌ పోలీసుల అదుపులో ఉన్నాడని అతని భార్యను సైతం తీసుకెళ్లి.. బాసర వద్ద గోదావరిలో పడేశారు. ఆపై వారి ఇద్దరు పిల్లలను చంపి పోచంపాడ్‌ సోన్‌ బ్రిడ్జి వద్ద కాలువలో తోసేశాడు. అనంతరం ప్రసాద్‌, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారని.. ప్రసాద్‌ ఇద్దరి చెల్లెళ్లను వేర్వేరుగా తీసుకెళ్లి హత్య చేశారు.

మొదటి మూడు హత్యలను ఒక్కడే చేసిన ప్రశాంత్‌.. తర్వాత ముగ్గురిని స్నేహితులతో కలిసి చంపినట్లు తెలుస్తోంది. హత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ వరుస హత్యలపై పోలీసుల ఇంకా వివరాలు వెల్లడించలేదు.