Image used for representational purpose only. | File Photo

Hyd, August 26: తెలంగాణలో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. మద్యం మత్తులో ఇద్దరు భర్తలు తమ భార్యలను దారుణంగా గొడ్డలితో (Two Men hacks their wives) నరికిచంపారు. ఈ ఘటనలు ఒకటి శంషాబాద్‌ పట్టణంలో చోటు చేసుకోగా మరోకటి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండ‌ల ప‌రిధిలోని చిట్యాల గ్రామంలో చోటు చేసుకుంది. శంషాబాద్‌ ఆర్‌జీఐఏ సీఐ శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక రాళ్లగూడ యాదవ్‌కాలనీలో పెద్దులు, దానమ్మ (25)దంపతులు నివాసం ఉంటున్నారు. దానమ్మ కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, పెద్దులు ఏ పని చేయకపోగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవపడుతుండేవాడు.

బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న పెద్దులు దానమ్మ మెడపై గొడ్డలితో నరకడంతో ఆమె కుప్పకూలింది. సమీపంలోనే ఉంటున్న సోదరులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే దానమ్మ మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నను చంపారన్న కోపంతో వారిని చంపాలని వెళ్లి తనే వాళ్ల చేతిలో చనిపోయాడు, ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి

ఇక కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండ‌ల ప‌రిధిలోని చిట్యాల గ్రామంలో మ‌ద్యానికి బానిసైన ఓ భ‌ర్త ఆ మ‌త్తులోనే భార్య‌ను హ‌త్య చేసి, తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. భార్య ఐదు నెల‌ల గ‌ర్భిణి అని కూడా చూడ‌కుండా.. విచ‌క్ష‌ణార‌హితంగా గొడ్డ‌లితో న‌రికి చంపాడు. చిట్యాల‌కు చెందిన సంజీవులు మ‌ద్యానికి బానిస‌గా మారాడు. ఈ క్ర‌మంలో భార్య ర‌మ్య‌తో త‌రుచూ గొడ‌వ ప‌డుతున్నాడు. గురువారం ఉద‌యం కూడా భార్య ర‌మ్య‌తో గొడ‌వ ప‌డ్డాడు. ర‌మ్య‌పై గొడ్డ‌లితో దాడి చేసి విచ‌క్ష‌ణార‌హితంగా న‌రికాడు. భార్య‌ను న‌రికిన గొడ్డ‌లితోనే భ‌ర్త సంజీవులు త‌న‌ త‌ల‌పై న‌రుక్కున్నాడు. అంత‌టితో ఆగ‌కుండా పొలం వ‌ద్ద ఉన్న తండ్రిపై అదే గొడ్డ‌లితో దాడి చేసేందుకు సంజీవులు బ‌య‌ల్దేరాడు.

సంజీవులును అడ్డుకునేందుకు గ్రామ‌స్తులు ప్ర‌య‌త్నించ‌గా, వారిపై కూడా దాడి చేసేందుకు య‌త్నించాడు. పొలం వ‌ద్ద‌కు వెళ్తూనే గ్రామ శివారులో స్పృహ కోల్పోయి ప‌డిపోయాడు సంజీవులు. గ్రామ‌స్తులు అప్ర‌మ‌త్త‌మై అత‌న్ని కామారెడ్డి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ సంజీవులు మృతి చెందాడు. హ‌త్య‌కు గురైన ర‌మ్య ఐదు నెల‌ల గ‌ర్భిణి. ఇప్ప‌టికే ఈ దంప‌తుల‌కు ఏడాదిన్న‌ర పాప ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.