Telangana: తెలంగాణలో కౌన్సిలర్ దారుణ హత్య, బైక్‌పై వెళ్తుండగా గొడ్డలితో దాడి చేసిన దుండుగులు, బానోతు ర‌వి హ‌త్య‌కు వ్యాపార లావాదేవీలే కార‌ణం తేల్చిన పోలీసులు
Councillor Banoth Ravi Naik hacked to death (Photo-Twitter)

Hyd, Apri 21: మహబూబాబాద్‌ జిల్లా పత్తిపాకలో పట్టపగలే దారుణ హత్యోదంతం చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ 8 వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ రవిని దుండగులు దారుణంగా (Councillor Banoth Ravi Naik hacked to death) హతమార్చారు. రవి బైక్‌పై వెళ్తుండగా కాపుగాసిన దుండగులు అతనిపై గొడ్డలితో దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన కౌన్సిలర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.

మ‌హ‌బూబాబాద్ మున్సిపాలిటీలోని 8వ వార్డు కౌన్సిల‌ర్ బానోత్ ర‌వి (Councillor Banoth Ravi Naik) హ‌త్య కేసు వివ‌రాల‌ను జిల్లా ఎస్పీ శ‌ర‌త్ చంద్ర వెల్ల‌డించారు. ర‌వి బైక్‌పై వెళ్తుండ‌గా ప‌త్తిపాక వ‌ద్ద కొంద‌రు ట్రాక్ట‌ర్ అడ్డం పెట్టి అత‌న్ని ఆపారు. కారులో వ‌చ్చిన దుండ‌గులు.. ర‌విపై గొడ్డ‌లితో దాడి చేసి పారిపోయారు. కుప్ప‌కూలిన ర‌విని (Banoth Ravi) స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ర‌వి ప్రాణాలు కోల్పోయాడు.

తెలంగాణకు ఏమీ చేయని మోదీ ఎందుకు? బోడి బీజేపీ ఎందుకు? వరంగల్ పర్యటనలో మండిపడిన కేసీఆర్, గుజరాత్‌కు పోతున్నది మన సొమ్మే, కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని వెల్లడి

అయితే ర‌వి హ‌త్య‌కు వ్యాపార లావాదేవీలే కార‌ణం అని, రాజ‌కీయాల‌తో సంబంధం లేద‌ని ఎస్పీ స్ప‌ష్టం చేశారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు 4 బృందాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు నిందితుల‌ను గుర్తించామ‌ని, అంద‌ర్నీ త్వ‌ర‌లోనే అరెస్టు చేస్తామ‌ని ఎస్పీ శ‌ర‌త్ చంద్ర పేర్కొన్నారు. మ‌హ‌బూబాబాద్ మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి బానోత్ ర‌వి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలుపొందారు.