Hyderabad, September 17: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అంతకుముందు అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా... సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత్ యూనియన్‌లో కలిసిన 1948 సెప్టెంబర్ 17న అప్పటి హోంశాఖమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించగా.... ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.