Khammam Shocker: భార్యను కత్తితో పొడిచి..పురుగుల మందు తాగిన భర్త,  రక్తపు మడుగులో ఇద్దరూ విగతజీవులుగా.. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Image used for representational purpose (Photo Credits: Pixabay)

Khammam, Mar 3: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తే కాలయముడుగా మారి భార్యను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి (Man Assassinated His Wife) చంపేశాడు. విషాద ఘటన వివరాల్లకెళితే.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజర్‌కు చెందిన సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వర రావు(65), విజయలక్ష్మి(60) దంపతులు కాగా వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కుమార్తె ఫారిన్‌లో ఉండగా.. మరొకరు రామగుండంలో ఉద్యోగం చేస్తున్నారు.

సుబ్రహ్మణ్యేశ్వర రావు, విజయలక్ష్మి మాత్రం సొంత ఊరిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఏం గొడవలో తెలియదు కాని.. సుబ్రహ్మణ్యేశ్వర రావు విజయలక్ష్మిని కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం తాను సైతం పురుగుల మందు తాగి బలవన్మరణానికి (Man Assassinated His Wife And Ends His Life) పాల్పడ్డాడు. కాగా భార్యాభర్తల అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా దంపతులు విగతజీవులుగా కనిపించారు. విజయలక్ష్మి రక్తపు మడుగులో పడి ఉండగా, సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆమె మృతదేహంతో పక్కనే అచేతనంగా పడి ఉన్నాడు.

నాతోనే ఉండు..పెళ్లి చేసుకోకు, యువతి అంగీకరించకపోవడంతో కత్తితో దాడి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పరిస్థితి విషమం, పోలీసులు అదుపులో నిందితుడు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమా లేదా ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. కాగా సుబ్రహ్మణ్యేశ్వర రావు చర్యతో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.