Govt of Telangana | File Photo

Hyderabad, April 28: తెలంగాణలోని ఉద్యోగార్థుల‌కు ప్ర‌భుత్వం మ‌రో తీపి క‌బురు అందించింది. మొన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి, నిన్న గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది. తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో (Transport)677 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ( Prohibition & Excise)పోస్టుల 614కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఇందులో 16,027 కానిస్టేబుల్(Constable) ఉద్యోగాలు కాగా, మిగ‌తా 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భ‌ర్తీకి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

CM KCR On Jobs: నిరుద్యోగుల‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్, తెలంగాణలో 80 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 18 శాఖలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నట్టు కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇందులో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 42, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు-91, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌-48, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టులు-41, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌-38, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-40, ఎంపీడీవో పోస్టులు-121తో పాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి.