COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, August 1: తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 21,011 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో  2083 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 883 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,58,593 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 64,786కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 578 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి జిల్లా నుంచి 228,  మేడ్చల్ నుంచి 197 , మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 101 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కరోనా విజృంభన కొనసాగుతోంది. మిగతా జిల్లాల్లో కూడా కొత్తగా వచ్చే పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా నుంచి 134 పాజిటివ్ కేసులు నమోదు కాగా,  కరీంనగర్  జిల్లా నుంచి  108 కేసులు వచ్చాయి.

Telangana's COVID Bulletin:

 

Status of positive cases of #COVID19 in Telangana

జూలై 31న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 11 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 530 కు పెరిగింది.

అలాగే, శుక్రవారం సాయంత్రం వరకు మరో 1114 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 46,502 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,754 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.