COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 417 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 4982కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీకి ఆరోగ్యశాఖ సిద్ధం

దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 13లోగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి....

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 417 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 4982కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీకి ఆరోగ్యశాఖ సిద్ధం
Coronavirus in TS (Photo Credits: IANS)

Hyderabad, January 6: తెలంగాణలో ప్రతిరోజు నమోదయ్యే కేసుల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి, నిన్నటి వరకు రెండు వందల్లో నమోదైన కొత్త కేసులు నేడు రెట్టింపయ్యాయి.  నిన్న రాత్రి 8 గంటల వరకు 43,318 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 417 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 471  మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 71,04,367 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,88,410కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  82 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 32 కేసులు వచ్చాయి, ఇక మిగతా అన్ని జిల్లాల నుంచి 20 లోపే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,556కు పెరిగింది.
అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 472 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 281,872 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,982 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 13లోగా  దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో 1500పైగా టీకా కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on Jan 06, 2021 10:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).