School Student (Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, June 10: తెలంగాణ (Telanagana)పాఠశాల విద్యాశాఖ కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 (July 01) నుంచి విద్యార్థులకు రెగ్యులర్‌ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేదీ నుంచి 30 వరకు బ్రిడ్జికోర్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జికోర్సులో (Bridge course) భాగంగా పై తరగతులకు ప్రమోట్‌ అయిన విద్యార్థి, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను ఈ రోజుల్లో చదవాల్సి ఉంటుంది. బ్రిడ్జి కోర్సులో భాగంగా డిజిటల్‌ పాఠ్యాంశాలతో (Digital classes)పాటు, ముఖాముఖి తరగతులు రెండింటిని నిర్వహించనున్నారు. ఈ కోర్సు కోసం ఒకటి, రెండు తరగతులను మినహాయించి, 3 నుంచి 10వ తరగతి వరకు నాలుగుస్థాయిలుగా విభజించారు.

Covid in TS: తెలంగాణలో పెరుగుతున్న కేసులు, గత వారం 555 కేసులు నమోదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు  

నాలుగు లెవల్స్‌గా విభజించి, రోజుకు ఆరు పీరియడ్స్‌ చొప్పున విద్యార్థులు గతంలో చదివిన పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన పాఠ్యాంశాలు బోధిస్తారు. తరగతుల వారిగా బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు.

Electric bike Explodes: అర్థరాత్రి పెద్ద సౌండ్‌తో పేలిన ఎలక్ట్రిక్ బైక్, ఇంటికి అంటుకున్న మంటలు, సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పెద్దచీకోడు గ్రామంలో ఘటన 

టీశాట్‌ (T-Sat) విద్యచానల్‌ ద్వారా డిజిటల్‌ పాఠ్యాంశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జులై1వ తేదీ నుంచి టీచర్లు ఆయా పాఠ్యాంశాలను త‌ర‌గ‌తి గ‌దిలోనే బోధిస్తారని అధికారులు తెలిపారు.