Representative Image (Photo Credits: IANS)

హైదరాబాద్ అంబర్‌పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించడం లేదని మైనర్ అమ్మాయి‌పై ఓ బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అడ్డు వచ్చిన ఆమె సోదరిపై కూడా ఆ బాలుడు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు.  అనంతరం విద్యానగర్ రైల్వే ట్రాక్‌పై పడుకుని బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన అమ్మాయిలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 Here's Video