SI, Constable Results: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు రిలీజ్, ఎంతమంది క్వాలిఫై అయ్యారో తెలుసా? ఇంత తక్కువ మంది అర్హత సాధిస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు
Credit@ Google

Hyderabad, OCT 21: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్స్, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌ ప్రాథమిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలంగాణ స్టేట్‌ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. 554 ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 7వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న రాత పరీక్ష నిర్వహించారు. ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా, 1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా, 1,84,861(31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల 

ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా, 18,758(44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518(43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. క్వాలిఫై అయిన అభ్యర్ధులకు ఈవెంట్స్ తో పాటూ మెయిన్స్ ఎగ్జామ్ ఆధారంగా జాబ్స్ ఇవ్వనున్నాయి. రానున్న మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.