
Hyderabad, AUG 13: ఈ నెల 7వ తేదీన నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ కీ (SI prelims exam primary key)విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ స్టేల్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (police Recrutement board) చైర్మన్ వివి శ్రీనివాస్ రావు ప్రకటన చేశారు. ఎస్ఐ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ కోసం www.tslprb.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ప్రాథమిక కీపై (primary key) అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 15న సాయంత్రం 5 గంటలకు వరకు బోర్డుకు తెలియజేయాలని సూచించారు. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు వేర్వేరుగా వెబ్‌సైట్‌లో సూచించిన విధానంలోని టెంప్లేట్స్ ఫార్మెట్‌లో ఆన్‌లైన్‌లోనే పంపాలని సూచించారు. తమ అభ్యంతరాన్ని ధ్రువీకరించేందుకు సరైన పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను పీడీఎఫ్ లేదా జేపీఈజీ ఫార్మెట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
అసంపూర్తి సమచారంతో పంపే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబడవని పేర్కొన్నారు. అదే విధంగా మ్యానువల్‌గా పంపే అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకోబడదని, కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలని పేర్కొన్నారు. కాగా, వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 554 ఎస్సై పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 2,25,759 మంది అభ్యర్థులు ఈ నెల 7న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు హాజరైన విషయం తెలిసిందే. ప్రైమరీ కీ విడుదల అవ్వడంతో ఎగ్జామ్ రాసిన అభ్యర్ధులంతా తమ ఆన్సర్లను సరిచూసుకుంటున్నారు.